నిర్మాత సురేష్ బాబు ఇంట్లో ఐటీ సోదాలు

475
Producer Suresh Babu
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటీ సురేష్ బాబు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రామా నాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై సోదాలు జరగుతున్నాయి. గత కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియో‌కు సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు చెబుతున్నారు. ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను హార్ట్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్‌ లో ప్రస్తుతం వెంకీమామ అనే సినిమా రూపొందుతుంది. వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ మూవీ రూపొందుతుంది. దాంతో పాటు పలు సినిమాలను డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా.అంతేకాకుండా ఏపీ తెలంగాణలో పలు థియేటర్లను కూడా నడిపిస్తున్నారు. ఇక సినిమా వాళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది కొత్తేమి కాదని చెప్పుకోవాలి. గతంలో మైత్రి మూవీ మేకర్స్‌,, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరిగిన విష‌యం తెలిసిందే.

- Advertisement -