అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కెటి రామారావు మూడో రోజు పలు కంపెనీలతో సమావేశం అయ్యారు. టెలికాం దిగ్గజాలైన నోకియా, ఎరిక్ సన్ కంపెనీలతో సమావేశం అయిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరారు. టెలికమ్యూనికేషన్లు, నెట్ వర్క్ రంగంలో ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలుగా ఉన్న ఈ రెండు సంస్దలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి వివరించారు. తాము చేపడుతున్న ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తామని, దీని వలన భారత దేశంలోని టెలి కమ్యూనికేషన్, ఇంటర్నెట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి తెలిపారు. ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యేందుకు నోకియా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆసక్తి చూపింది.
త్వరలోనే ఫైబర్ గ్రిడ్ కోసం జారీ చేయబోయే అర్ యప్ ఫి (RFP) లో పాల్గోంటామని తెలిపింది. తెలంగాణలో ఎర్పాటు చేయనున్న డాటా అనాలిటిక్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నొకియాను కోరారు. తెలంగాణలో నోకియా మోబైల్ పరికరాల తయారీ ప్లాంట్ లేదా అర్ అండ్ డి సెంటర్ ఎర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు ఎరిక్ సన్ కంపెనీలో పర్యటించి మంత్రి అక్కడి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను పరిశీలించారు. ఇంటర్ నెట్ అనుసంధానం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఈ రంగంలో ఎరిక్ సన్ చేస్తున్న పలు పరిశోధనలను పరిశీలించారు.
యూయస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కెటి రామారావు పాల్గోన్నారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రాధాన్యతలు, అవకాశాలు అనే అంశంపైన ప్రముఖ పెట్టుబడిదారులతో ముఖాముఖి సంభాషించారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అత్యుత్తమ వ్యాపార విధానాలను అమలు పరుస్తున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను, పాలసీలను అనేక రాష్ట్రాలు స్పూర్తిగా తీసుకుంటున్నాయని తెలిపారు. పరిశ్రమలు, సోలార్ , ఐటి రంగాల పైన పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమధానాలిచ్చారు.
మ్యూల్ సాప్ట్ కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృదంతో మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కంపెనీ విస్తరణ అవకాశాల మీద మంత్రితో చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి తెలంగాణ రాష్ర్టంలో గత మూడు సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడులను వివరించారు. తెలంగాణ రాష్ర్టం అభివృద్ది పెరుగుదల రేటులో చాలా వేగంగా అభివద్ది చెందుతున్నదని వివరించారు. తమ మ్యూల్ సాప్ట్ కంపెనీ విస్తరణ అవకాశాలు పరిశీలిస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని సైతం తమ ప్రణాళికల్లో ఉంచుతామని మంత్రికి హమీ ఇచ్చారు. తమ కంపెనీ వేగంగా విస్తరిస్తున్న తీరును మంత్రికి తెలిపారు. హైదరాబాద్ నగరం అభివృద్ది చెందిన తీరుపైన కంపెనీ ప్రతినిధులు ప్రశంసలు తెలిపారు.
స్టార్టప్ కంపెనీలకు సేవలందించేందుకు స్ర్టైప్ కంపెనీతో మంత్రి సమావేశం అయ్యారు. ముఖ్యంగా అర్దిక సేవలు అందించే ఈ కంపెనీ ప్రతినిధులకు డిజిటల్ ట్రాన్స్ టాక్షన్స్ లో తెలంగాణ మెదటి స్ధానంలో ఉన్నది. డిమాటైజేషన్, అర్ధిక లావాదేవీల డిజిటలైజేషన్ నేపథ్యంలో స్రైప్ కంపెనీ విస్తరణకు అవకాశాలున్నట్లు మంత్రి తెలిపారు. అమెరికాలో కంపెనీలు ప్రారంభిచాలనుకునే వారికోసం తమ కంపెనీ ప్రొడక్ట్ అయిన అట్లాస్ తో సహాకారం అందిస్తామని మంత్రికి వారు తెలిపారు. ఈ మేరకు అత్యదిక స్టార్ట్ అప్స్ ఉన్న టిహబ్ ద్వారా కలసి పనిచేస్తామని, సిలికాన్ వ్యాలీలో టి హబ్ ఎర్పాటు చేసిన టి బ్రిడ్జ్ తో కలిసి పనిస్తామని కంపెనీ మంత్రికి తెలిపింది.