చలపయ్యకు.. రామ్‌ కౌంటర్..

241
Ram Strong Counter To Chalapathi Rao
- Advertisement -

మహిళలపై సినీనటుడు చలపతి రావు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తుతున్నారు.

ఇంత సంచలనంగా మారిన చలపతిరావు కామెంట్‌ పై పలువురు సినీస్టార్లు కూడా చలపయ్యపై ఘరం అవుతున్నారు. ఇదే క్రమంలో హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్‌ సైతం చలపతి వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని అంతేకాకుండా  ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఘాటేగానే వ్యాఖ్యానించింది రకుల్‌.
  Ram Strong Counter To Chalapathi Rao
ఇదే క్రమంలో నాగార్జున కూడా సోషల్ మీడియా సాక్షిగా చలపతి రావు ఆ కామెంట్లను ఖండించారు. “నేను నిజ జీవితంలోనైనా సినిమాల్లోనైనా ఆడాళ్లని చాలా గౌరవిస్తాను. చలపతిరావు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. డైనోసార్లు అనేవి ఇప్పుడు లేవు” అంటూ తెలివిగా చురకలు వేశారు నాగార్జున. ఇలా సినీ స్టార్ల నుంచి ఇప్పటికే చలపయ్యపై కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.
  Ram Strong Counter To Chalapathi Rao
ఇక తాజాగా  హీరో రామ్‌ కూడా చలపతిరావు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. చలపతిరావు చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ట్విట్టర్ ద్వారా… ‘చలపతిరావు గారూ.. మీ నుంచి మేం క్షమాపణ ఆశించడం లేదు. కానీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా మహిళల యొక్క నిజమైన విలువ తెలుసుకోకుండా బతుకుతున్నందుకు బాధపడుతున్నాం. మా జనరేషన్‌కు మహిళలపై మీలాంటి చులకన భావాలు లేవు.

అందుకు మేం గర్వపడుతున్నాం. మీరు కూడా మహిళల విలువ తెలుసుకోవాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని మేం ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నామ’ని ట్వీట్‌ చేశాడు రామ్‌ పోతినేని.

 Ram Strong Counter To Chalapathi Rao

- Advertisement -