ఆ విషయంలో రవికి సపోర్ట్‌ చెయ్యను..

276
- Advertisement -

మహిళలపై సినీనటుడు చలపతి రావు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తుతున్నారు.  అయితే రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్‌లో ఆడవాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు చలపతిరావు బహిరంగ క్షమాపణ చెప్పినా వేడి చల్లారడంలేదు.
Srimukhi Shocking Comments on Anchor Ravi
చలపతిరావు మాట్లాడింది ముమ్మాటికి తప్పేనంటూ పలువురు సినీ ప్రముఖులతో సహా మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక ఇదే వ్యవహారంలో  యాంకర్ రవిపై కూడా మండిపడుతున్నారు. రవిపై వస్తున్న వ్యతిరేకతపై రవి రియాక్ట్‌ అయ్యాడు.  తనతప్పు లేదంటూ వీడియో మెసేజ్ ద్వారా వివరణ ఇచ్చాడు రవి.

ఆ సమయంలో చలపతిరావు ఏం మాట్లాడారో తనకు అర్థం కాలేదని, సాంకేతిక సమస్య వల్ల ఆయన మాటలు తాను వినలేకపోయానని చెప్పాడు. అయితే ప్రేక్షకులంతా అరుస్తూ ఉంటే ఆయనదే ఆడవాళ్లపై పంచేశారనుకుని సూపర్ అన్నానని వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా తనతోపాటు యాంకరింగ్ చేసిన గీతా భగ్వత్‌తో కూడా ఈ వీడియోలో రవి వివరణ ఇప్పించాడు.
 Srimukhi Shocking Comments on Anchor Ravi
అయితే ఈ మధ్య రవిపై నెగిటివ్ టాక్ ఎక్కువైపోయింది. పటాస్‌లో కూడా యాంకర్ శ్రీముఖితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. చలపతిరావు వ్యాఖ్యలు, అవి రవికి చుట్టుకోవడంపై యాంకర్ శ్రీముఖి స్పందించింది. ‘చలపతిరావు మాటలు ముమ్మాటికి తప్పే. లైవ్‌గా జరుగుతున్న ఆడియో ఫంక్షన్‌లో స్టేజ్ మీద ఉన్న యాంకర్లకు ఇతరులు ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటాయి. దీనివల్లే రవి చలపతిరావు మాటలు వినిఉండకపోవచ్చు. గతంలో ఇలాంటి సమస్య నాకు ఎదురైంది. కానీ చలపతిరావు వ్యాఖ్యల విషయంలో మాత్రం రవికి నేను సపోర్ట్ చేయలేను’ అని శ్రీముఖి చెప్పారు.

అలాగే రవి ఎప్పుడూ తనతో చెడుగా ప్రవర్తించలేదని శ్రీముఖి స్పష్టం చేసింది. ‘రవితో పటాస్‌తో పాటు చాలా కార్యక్రమాలు చేశాను. కానీ నాతో ఎప్పుడూ చెడుగా మాట్లాడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం చేయలేదు. ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే రవితో కలసి పనిచేయడం మానేసేదాన్ని. రవితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని చెప్పుకొచ్చింది శ్రీముఖి .

- Advertisement -