తెలంగాణ వీడుతున్న ఐటీ కంపెనీలు!

46
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఐటీ రంగం ప్రశ్నార్థకంగా మారుతోందా ? బడా కంపెనీలు తెలంగాణ వీడేందుకు సిద్దమౌతున్నాయా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత పదేళ్ళ కాలంలో బి‌ఆర్‌ఎస్ పాలనలో ఐటీ రంగం జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టింది. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన కే‌టి‌ఆర్.. బడా కంపెనీలని రాష్ట్రనికి తీసుకు రావడంతో గ్రాండ్ గా సక్సస్ అయ్యారు. తన విజన్ తో హైదరబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. వేల కోట్ల పెట్టుబడికి హైదరబాద్ ను కేంద్రంగా మార్చారు. అయితే ఊహించని రీతిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఓటమి చవిచూడడంతో అందరి చూపు ఐటీ రంగంపైనే పడింది.

ముందు రోజుల్లో ఐటీ రంగం ఎలా ఉండబోతుంది. బి‌ఆర్‌ఎస్ స్థాయిలో కాంగ్రెస్ ఐటీ రంగాన్ని అభివృద్ది చేయగలదా ? కే‌టి‌ఆర్ వంటి ఐటీ మినిస్టర్ కాంగ్రెస్ లో ఉన్నారా ? ఇలాంటి ప్రతి సామాన్యుడి మదిలో మెదిలాయి. ఇక కాంగ్రెస్ తరుపున ప్రస్తుతం శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది రోజులు కాకమునుపే ఐటీ కంపెనీలు హైదరబాద్ నుంచి తరలిపోవడం గమనార్హం. తాజాగా యూఎస్ కు చెందిన కార్నింగ్ గ్లాస్ కంపెనీ హైదరబాద్ నుంచి తమిళనాడుకు తరలిపోయింది.

ఈ సెప్టెంబర్ లో రూ.934 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కార్నింగ్ సంస్థ రెండు నెలలు గడవక ముందే తరలిపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక బడా కంపెనీ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళడం గత పదేళ్ళ కాలంలో ఇదే మొదటిసారి. ఇక కాంగ్రెస్ పాలనలో ముందు రోజుల్లో మరిన్ని ఐటీ సంస్థలు రాష్ట్రాన్ని వీడతాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరి కాంగ్రెస్ సర్కార్ ఐటీ రంగం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది. గత ప్రభుత్వం మాదిరి ఐటీ రంగాన్ని అభివృద్ది చేసే సత్తా కాంగ్రెస్ పాలకులకు ఉందా అనేది చూడాలి.

Also Read:Jagan:జగన్ ప్లాన్స్.. వర్కౌట్ అయ్యేనా?

- Advertisement -