Review 2023:యంగ్ హీరోల్లో హిట్ కొట్టింది వీరే!

32
- Advertisement -

2023 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. ఇక ఈ సంవత్సరం వెండితెరపై కొంతమంది హీరోలు హిట్ కొడితే కొంతమంది హీరోలు ఫ్లాప్‌ను మూగగట్టుకున్నారు. ప్రధానంగా యంగ్ హీరోలైన నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నితిన్ హిట్ కొట్టారా లేదా ఫ్లాప్ మూటగట్టుకున్నారా తెలుసుకుందాం.

ముందుగా నాని విషయానికొస్తే ఈ సంవత్సరం గుర్తుండిపోయే సంవత్సరం అనే చెప్పాలి. దసరాతో తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టారు నాని. ఇక నాని నటించిన హాయ్ నాన్నతో డీసెంట్ హిట్ కొట్టారు. ఇక అక్కినేని నాగ చైతన్యకు మాత్రం మిశ్రమ ఫలితాలనే మిగిల్చింది. కస్టడీ సినిమాతో నిరాశ పర్చినా దూత వెబ్ సిరీస్ తో మాత్రం హిట్ అందుకున్నాడు.

ఇక సక్సెస్ కోసం చూస్తున్న విజయ్ దేవరకొండ ఖుషితో ఆలోటును భర్తీ చేసుకున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. హీరో రామ్ పోతినేనికి ఈ సంవత్సవరం బ్యాడ్ మెమోరీస్‌నే మిగిల్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్కంద బాక్సాఫీస్ వద్ద బోళ్తా పడింది. వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది సక్ఎస్ అందుకోలేదు. గాండీవధారి అర్జున డిజాస్టర్‌గా నిలిచింది.

ఇక రోడ్డు ప్రమాదం తర్వాత విరూపాక్షతో సక్సెస్ రుచి చూశారు సాయి ధరమ్ తేజ్. కళ్యాణ్ రామ్ అమిగోస్ తో వినూత్న ప్రయోగం చేసినా అది ఫలించలేదు. నితిన్‌కు 2023 అస్సలు కలిసి రాలేదు. ఎక్స్‌టార్డినరీ మ్యాన్ కు కనీస ఆదరణ దక్కలేదు. నిఖిల్ స్పై,అఖిల్ ఏజెంట్, సందీప్ కిషన్ మైఖేల్, విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ, సుధీర్ బాబు హంట్ ప్రేక్షకాదరణ పొందలేదు.

Also Read:చలికాలంలో ఆస్తమా.. జాగ్రత్త!

- Advertisement -