పవన్‌తో చంద్రబాబు…లవ్ @ వన్ సైడ్

24
pawan

ఏపీలో జనసేనతో పొత్తుపై టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా జనసేనతో పొత్తుపై స్పందించారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలుపుకుపోవాలని చంద్రబాబును టీడీపీ నేతలు కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. లవ్‌ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలని, ఏకపక్షంగా లవ్‌ చేయడం కరెక్ట్‌ కాదంటూ చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రినన్నారు చంద్రబాబు. జమిలి ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా టీడీపీ విజయం తథ్యమన్నారు. టీడీపీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు చంద్రబాబు.