మహేష్ గెట్ వెల్ సూన్..

34
mahesh

ప్రిన్స్ మహేశ్ బాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మహేశ్‌ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించగా సోషల్ మీడియాలో మహేశ్‌ గెట్ వెల్ సూన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక పలువురు సెలబ్రెటీలు సైతం మహేశ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్,అనిల్ రావిపూడి…మహేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహేష్ ఫ్యామిలీతో దుబాయ్‌లో ఉన్నప్పుడు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

ప్రస్తుతం మహేష్‌.. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట”లో కీర్తి సురేష్‌ తో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది.