కాటమరాయుడు మేకింగ్ వీడియో..

129
pawan

కాటమరాయుడు లుక్స్ తో ఇప్పటికే పవన్ అభిమానులకు న్యూ గిఫ్ట్ ఇచ్చిన టీం..తాజాగా మరో బహుమతి అందించింది. కాటమరాయుడికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కాటమరాయుడి టీం సభ్యులంతా పవన్ అభిమానులకు..ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో పవన్..హీరోయిన్ శృతి కూడా ఉన్నారు. కొన్ని మేకింగ్ షాట్స్తో పాటు రిలీజ్ చేసిన ఈ వీడియో పవన్ విషెస్ చెప్పకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమా చేసిన దర్శకుడు డాలీ..మరోసారి పవన్ తో కాటమరాయుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా ఈ సినిమాను రూపొందుతోంది. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. క్లైమాక్స్ పాటు పాటలు..చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ బ్యాలెన్స్గ మిగిలాయి.

New Year Wishes From Katamarayudu Team