ఇస్రో ఈ యేడాది ఆఖరిగా నిర్వహించే ప్రయోగమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. నవంబర్ 26న ఉదయం 11.56గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ54/eos-06ను ప్రయోగనించనుంది. ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. రేపు సరిగ్గా 11.56 గంటలకు రాకెట్ ప్రయోగం చేయనున్నట్టు ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నామన్నారు.
2022వ సంవత్సరానికి గాను ఇదే ఆఖరి పరీక్ష అని తెలిపారు. కాగా డిసెంబర్‌లో అగ్నికుల్ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. 2023 ఫిబ్రవరి నెలలో జీఎస్ఎల్వీ – మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నామన్నారు. కాగా కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం.
ఇవి కూడా చదవండి…