బాలయ్యతో ‘ఖిలాడీ’ భామ.. హాట్ హాట్ గా..!

122
- Advertisement -

నట సింహం బాలయ్య – అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న సినిమా షూట్ డిసెంబర్ 8న నుంచి స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో హాట్ బాంబ్ మీనాక్షి చౌదరి బాలయ్య బాబుతో ఘాటు స్టెప్స్ వేయబోతుంది. మీనాక్షి చౌదరి గతంలో ‘ఖిలాడీ’లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. హీరోయిన్ కి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అని అమ్మడు నటనా చాతుర్యం పై చాలా విమర్శలు వచ్చాయి. మొత్తమ్మీద నటన విషయంలో తేలిపోయినా, తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మనసులను మాత్రం బాగానే దోచుకుంది.

అందుకే, మీనాక్షి చౌదరికు ఐటమ్ సాంగ్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సినిమాలో సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ లో తన అందచందాలతో ఆకట్టుకోవడానికి మీనాక్షి చౌదరి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. పల్నాటి సీమలో సాగు నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతుంది. బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడని.. బాలయ్య లుక్ ను అనిల్ రావిపూడి స్టైలిష్ మాసివ్ అవతార్ లో డిజైన్ చేశాడని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో హిందీ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ‘అఖండ’ తర్వాత నట సింహం రేంజ్ మారిపోయింది. అందుకే, ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా నిర్మాతలు కాంప్రమైజ్ కావడం లేదు.

ఇవి కూడా చదవండి…

ప్చ్.. అసలు ఇంతాలస్యం ఎందుకు కొరటాలా ?

మీ జీవితం ఓ సంబరం.. లవ్ యూ నాన్న – మహేష్ బాబు

విశ్వక్ సేన్..’దాస్‌ కా ధక్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

- Advertisement -