భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. PSLV-C62 మిషన్‌ను జనవరి 12న ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగం భారత కాలమానం ప్రకారం ఉదయం 10.17 గంటలకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక (First Launch Pad – FLP) నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ విషయాన్ని ఇస్రో తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. PSLV రాకెట్ ద్వారా ముఖ్యమైన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. PSLV రాకెట్ విశ్వసనీయతకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, గతంలో అనేక విజయవంతమైన ప్రయోగాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ మిషన్ భారత అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగానికి సంబంధించి అన్ని సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయని, రాకెట్ సమగ్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని సమాచారం. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే నిర్ణీత సమయానికే ప్రయోగం చేపడతామని అధికారులు తెలిపారు. PSLV-C62 మిషన్ విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో తన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటనుంది.
Also Read:TTD:రేపటితో వైకుంఠ దర్శనాలు క్లోజ్!

