మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. అలాగే టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో కలిసి మారిషస్ అధ్యక్షుడిని ఆత్మీయంగా స్వాగతించారు.
దర్శనం అనంతరం ఆలయ పండితులు ధరమ్ బీర్ గోకుల్‌కు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకుని, తిరుమల ఆలయ ఆధ్యాత్మిక విశిష్టతపై ఆయన ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరుమల సందర్శన తనకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని అధ్యక్షుడు పేర్కొన్నారు.
Also Read:ఫాస్టింగ్‌పై అధ్యయనం..షాకింగ్ నిజాలు!
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మారిషస్ అధ్యక్షుడి తిరుమల పర్యటనతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక వైభవాన్ని సంతరించుకుంది.


