ఆధునిక మానవుడి జీవనం రోజురోజుకూ అంతరిక్ష పరిజ్ఞానంతో పెనవేసుకుపోతోంది. ఇంటర్నెట్, జీపీఎస్, టీవీ ప్రసారాలు, టెలి కమ్యూనికేషన్లు, వాతావరణ హెచ్చరికలు, పట్టణ ప్రణాళికలు, వ్యవసాయం, భద్రత వంటి అనేక అంశాల్లో మనం శాటిలైట్ సేవలు పొందుతున్నాం. ఉక్కు నుండి అంతరిక్షం వరకు ఇస్రో సాధించిన ప్రగతి దేశాభివృద్ధికి వెన్నెముకలా నిలిచింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) ఏర్పాటు చేసి, 1975లో భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. ఆ తరువాత అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతి అజరామరం. ఏకధాటిగా ఒకేసారి 104 కృత్రిమ ఉపగ్రహాలను కక్ష్యలో నిలబెట్టింది ఇస్రో. చంద్రుడు, అంగారకుడు (మార్స్) పైకి ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదిగాం.
విశ్వవేదికపై భారత ఖ్యాతిని ధృవతారగా నిలిపించది ఇస్రో. మొదటి ప్రయత్నంలోనే కుజగ్రహాన్ని విజయవంతంగా చేరడం (మంగళ్‌యాన్), ఒకే ప్రయత్నంలో 10 ఉపగ్రహాలను ప్రయోగించడం, దేశీయ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ రాకెట్ యంత్రాల సహాయంతో భారీ భూస్థావర ఉపగ్రహాలను ప్రయోగించడం, చంద్రయాన్ పేరుతో మానవ రహిత అంతరిక్షయాత్రను నిర్వహించడం వంటి ఎన్నో ఘన విజయాలను ఇస్రో సాధించింది.
1962లో ప్రారంభించిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (INCOSPAR) 1969లో ఇస్రోగా రూపాంతరం చెందింది. భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహింగీర్ బాబా, భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ కాస్మిక్ కిరణాలపై చేసిన పరిశోధనలు భారతదేశం అంతరిక్ష విజ్ఞానాభివృధ్ధికి తొలి అడుగులు వేయడానికి తోడ్పడ్డాయి. విక్రమ్ సారాభాయ్ మరణానంతరం TERLSకి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)గా నామకరణం చేశారు. తర్వాత శ్రీహరికోటలో రెండో రాకెట్ లాచింగ్ స్టేషన్‌ను 1971లో ప్రారంభించారు. 2002లో దీని పేరును సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR)గా మార్చారు.
Also Read:పెళ్లి రోజు..గ్రీన్ ఛాలెంజ్
2015, సెప్టెంబరు 28న PSLV-C30 రాకెట్ ద్వారా భారత తొలి అంతరిక్ష పరిశోధన శాల ఆస్ట్రోశాట్‌తో పాటు మరో 6 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్ – 1 ఇదొక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. చంద్రుడికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబరు 22న దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్ – 1 విజయవంతంతో ఈ ఘనత సాధించిన 6వ దేశంగా భారత్ అవతరించింది. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతంగా కక్షలోకి ప్రవేశ పెట్టినప్పటికి చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ లాండింగ్ అయి ఆ ప్రయోగం విఫలం అయింది.
రీసెంట్‌గా చంద్రయాన్ – 3ని ప్రవేశపెట్టగా ఇది విజయవంతంగా చంద్రుడిపై లాండ్ అయితే దక్షిణ ధ్రువంలో లాండ్ అయిన మొదటి దేశంగా భారత్ కీర్తి ప్రపంచ దేశాలలో రెపరెపలాడనుంది. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రుడిపై నీటి జడలను తెలుసుకోవడంతో పాటు మానవ మనుగడకు చంద్రుడి వాతావరణం అనుకూలమా లేదా అనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read:భారతదేశంలో సైన్స్ & టెక్నాలజీ…విజయాలు