ప్రభాస్ కల్కి రిలీజ్ పై క్లారిటీ

30
- Advertisement -

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఐతే ఈ చిత్రం విడుదల వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ‘‘కల్కి’ షూటింగ్‌ ఇంకా కొంతభాగమే మిగిలుంది. త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రస్తుతం నా ఏకాగ్రతంతా దానిపైనే ఉంది. అది పూర్తయ్యాక విడుదల తేదీ గురించి ఆలోచిస్తామని తెలిపాడు. సో.. నాగ్ అశ్విన్ మాటలను బట్టి.. కల్కి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు.

కాకపోతే.. ప్రభాస్ పార్ట్ కి సంబంధించి సిజీ వర్క్ ఇంకా చాలా ఉంది. పైగా ఇది చాలా సమయం పడుతుందట. ఒకవేళ గ్రాఫిక్స్ కి టైమ్ తీసుకుంటే.. అప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ గురువు పాత్రలో నటించనున్నాడు. కమల్ – ప్రభాస్ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయట.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌, హాలీవుడ్‌కు ధీటైన‌ గ్రాఫిక్స్ హంగుల‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ ఫ‌స్ట్‌ గ్లింప్స్ అభిమానుల‌ను మెస్మరైజ్ చేసింది. నిజానికి ఈ మూవీ నుంచి మొదట రిలీజైన ప్రభాస్ లుక్‌ను చూసి అభిమానులు ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు. దానికి తగ్గట్లుగానే ప్రభాస్ లుక్ కూడా ఏమి బాగాలేదు. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన ఫ‌స్ట్‌ గ్లింప్స్ ఒక్కసారిగా సినిమా పై అంచనాలు పెంచేసింది.

Also Read:76 ఏళ్ల భారతం..ప్రగతి పథంలో ఉన్నామా?

- Advertisement -