ఇరాన్ పై క్షిపణులతో ఇరుచుకపడింది ఇజ్రాయెల్. శుక్రవారం ఉదయం ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇస్ఫాహాన్‌లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని అక్కడి పత్రికలు తెలిపాయి.
అయితే, మీడియా కథనాలను అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది.
గత శనివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్‌లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. 300లకుపైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది. ఈ దాడికి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read:కడియంకు సవాల్ విసిరిన రాజయ్య..