ఏపీ లిక్కర్‌ పాలసీ..ఒక్కరికి మూడు బాటిళ్లే..!

477
ap liquor policy
- Advertisement -

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మద్య పాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పర్యవేక్షణ ఉంటుంది. సర్కారీ మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్ లు ఉండవు. రోడ్డుపై మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు.

కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా మద్యం షాపుల సంఖ్యను తగ్గించిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో ఉత్తర్వు జారీ చేసింది. ఒక వ్యక్తి దగ్గర పరిమితికి మించి మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఒక వ్యక్తి దగ్గర మూడు కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు తీసుకుంటారు.

ఏ వ్యక్తి దగర అయినా 3 సీసాలకు మించి స్వదేశీ, విదేశీ మద్యం సీసాలు ఉండకూడదు. ఈ నిర్ణయం బుధవారం(సెప్టెంబర్ 25,2019) నుంచే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఆదేశాల ప్రకారం బీరు సీసాలు ఆరుకు మించి ఉండకూడదు. తాటికల్లు కూడా 2 లీటర్లకు మించి ఉండకూడదు.అంతేగాదు ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలి….. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

- Advertisement -