- Advertisement -
బంగ్లాదేశ్ టూర్‌లో ఉన్న భారత జట్టు మూడో వన్డేలో విశ్వరూపం ప్రదర్శిస్తుంది. విరాట్‌తో కలిసి రెండో వికెట్ భాగస్వామ్యంతో ఇషాన్ (210) డబుల్ సెంచరీ సాధించారు. డబుల్ సెంచరీలు చేసిన వాళ్లల్లో నాలుగవ బ్యాట్స్ మెన్‌గా రికార్డు సృష్టించారు. దీంతో సచిన్, రోహిత్ శర్మ, విరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచారు. మొట్టమొదటి సారిగా క్రికెట్ ప్రపంచంలో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ చరిత్ర సృష్టించారు.
𝟐𝟎𝟎 𝐑𝐔𝐍𝐒 𝐅𝐎𝐑 𝐈𝐒𝐇𝐀𝐍 𝐊𝐈𝐒𝐇𝐀𝐍 🔥🔥
𝐖𝐡𝐚𝐭 𝐚 𝐬𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐡𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐭𝐡𝐢𝐬 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧.
He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 💥💥#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv
— BCCI (@BCCI) December 10, 2022
లిస్ట్ ఇదే…
- ఫిబ్రవరి 24, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్‌లో 200 పరుగులు
- డిసెంబర్ 8, 2011 వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కు చెందిన వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు
- నవంబర్ 2, 2013 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రీడాకారుడు రోహిత్ శర్మ 209 పరుగులు
- నవంబర్ 13, 2014 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ 264 పరుగులు
- మే 21, 2015 వెస్టీండీస్ తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కు చెందిన గుప్తిల్ 237 పరుగులు
- ఫిబ్రవరి 24, 2015 జింబాబ్వే తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ కు చెందిన క్రిస్ గేల్ 215 పరుగులు
- డిసెంబర్ 13, 2017 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రీడాకారుడు రోహిత్ శర్మ 208 పరుగులు
- జులై20, 2018 జింబాబ్వే తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రీడాకారుడు ఫఖర్ జమాన్ 210 పరుగులు
- డిసెంబర్ 10, 2022 బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ కిషన్ 210 పరుగులు
ఇవి కూడా చదవండి…
మెస్సి మెరిసే…నేయ్‌మార్ ఏడిసే
భారత క్రికెట్ షెడ్యూల్ ఇదే…
ఆంధ్రాలో వెలిసిన ఫ్లెక్సీలు….
- Advertisement -