మెగాస్టార్ పై కూడా హీరోయిన్ ఎఫెక్ట్

154
- Advertisement -

మెహర్ రమేష్ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాలి. కానీ, ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే, నాలుగు అడుగులు వెనక్కి వేస్తోంది. ఎప్పుడు మెగాస్టార్ మీద షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటున్నా.. ఈ సినిమాకి ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతోంది. మొన్నటివరకు చిరంజీవి బిజీ కారణంగా ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అంతా ఓకే అనుకున్న టైమ్ కు మెగాస్టార్ సరసన హీరోయిన్ ఫైనల్ కాలేదు. మెహర్ రమేష్ తెచ్చిన హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి టీమ్ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కావడం లేదు.

అసలు మెగాస్టార్ కి పాన్ ఇండియా హీరోయిన్ కావాలి. కాబట్టి.. హీరోయిన్ ది కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ అయ్యి ఉండాలి. కానీ.. ఆ రేంజ్ భామలు అంతా ఫుల్ బిజీ. అందుకే.. చిరంజీవి కి హీరోయిన్ సెట్ కాలేదు. కేవలం సరైన హీరోయిన్ దొరక్కపోవడం కారణంగానే మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ సినిమా లేట్ అవుతోంది. ఆల్ రెడీ కొంత షూటింగ్ ఈ చిత్రం జరుపుకుంది.

కానీ కీలకమైన పార్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. త్రిష ను అనుకున్నా.. ఇప్పటికే ఒప్పుకున్న వేరే సినిమాలు కారణంగా.. మెగాస్టార్ సినిమా కొత్త షెడ్యూల్ కు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ కొంచెం డిలే అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకీ మెహర్ రమేష్.. మెగా స్టార్ కోసం ఎలాంటి ఎమోషన్స్ డిజైన్ చేశాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఒక్క కృతిశెట్టి కి మాత్రమే ఎరుక ?

ధమాకా… దండ కడియాల్ సాంగ్‌

నాడు కిడ్స్‌..నేడు స్టార్స్‌….

- Advertisement -