జగన్ ను భయపెడుతున్న షర్మిల?

38
- Advertisement -

ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీలో తలనొప్పి మొదలైంది. ఏపీలో షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా షర్మిల రాకను స్వాగతించడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ వదిలి షర్మిలా ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడితే వైఎస్ జగన్ కు తీవ్ర తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ 175 సీట్లలో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దానికి తగ్గట్లుగానే పార్టీలో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజక వర్గాల్లో ఇంచార్జ్ లను మార్చిన జగన్.. మరో 30 స్థానాల్లో నేతలను పక్కన పెట్టె ఆలోచనలో ఉన్నట్లు టాక్. .

దీంతో అసంతృప్త వాదులంతా వైసీపీ వీడి షర్మిల పక్షాన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే తాను ఆమె వెంటే నడుస్తానని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ లోని మరికొంత మంది నేతలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఒకవేళ నిజంగానే షర్మిల ఏపీ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తే ఎక్కువ శాతం నష్టపోయేది జగనే అని చెబుతున్నారు విశ్లేషకులు.

గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన నేతలు.. అలాగే తాజాగా జగన్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న మరికొంత మంది నేతలు అందరూ కూడా మూకుమ్మడిగా షర్మిల కు మద్దతు పలికే అవకాశం ఉంది. దాంతో వైసీపీ ఓటు షేర్ లో భారీగా చీలిక వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. అయితే షర్మిల తన అన్న జగన్ కు వ్యతిరేకంగా నిలుస్తుందా అనేది అసలు ప్రశ్న. గత కొన్నాళ్లుగా అన్న చెల్లెళ్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పరోక్షంగాను ప్రత్యక్షంగాను జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తు వచ్చారు వైఎస్ షర్మిల. ఈ పరిణామాలను బట్టి చూస్తే ఆమె జగన్ కు వ్యతిరేకంగా నిలబడేందుకు ఏమాత్రం వెనకడుగు వేయదనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఏపీలో షర్మిల ఎంట్రీ జగన్ కు పెను ముప్పే అని చెప్పవచ్చు.

Also Read:తండేల్ షూట్‌లో సాయి పల్లవి

- Advertisement -