మీ ఎయిర్ కండీషనర్ (AC)ను సర్వీసింగ్ చేసినప్పటికీ సరైన కూలింగ్ ఇవ్వకపోతే, అసలు సమస్య కూలింగ్ కాయిల్‌లో (ఈవాపొరేటర్ లేదా కండెన్సర్ కాయిల్) ఉండే అవకాశం ఉంది. ధూళి పేరుకుపోవడం, గ్యాస్ లీక్ అవడం లేదా కాయిల్ డ్యామేజ్ అవడం వల్ల కూలింగ్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది.
ఏసీలో కూలింగ్ కాయిల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది వేడి మార్పిడిని నిర్వహిస్తుంది. కాయిల్ మురికి పడితే, కరప్ట్ అయితే లేదా డ్యామేజ్ అయితే, సర్వీసింగ్ చేసినా AC సరైన విధంగా చల్లదనం ఇవ్వదు.
కింది లక్షణాలు కనిపిస్తే కూలింగ్ కాయిల్ సమస్య ఉండొచ్చు:
AC గాలి ఇస్తుంది కానీ చల్లదనం ఉండదు
ఇండోర్ యూనిట్‌పై ఐస్ (మంచు) ఏర్పడుతుంది
ఇండోర్ యూనిట్ నుంచి నీరు లీక్ అవుతుంది లేదా విచిత్రమైన వాసన వస్తుంది
అకస్మాత్తుగా విద్యుత్ బిల్లు పెరుగుతుంది
గాలి ప్రవాహం బలహీనంగా ఉంటుంది లేదా టర్బో మోడ్ పనిచేయదు
కూలింగ్ కాయిల్ సమస్యను ఎలా పరిష్కరించాలి?
డీప్ క్లీనింగ్: కాయిల్‌పై ధూళి ఉంటే పూర్తిగా శుభ్రం చేస్తారు
గ్యాస్ రీఫిల్లింగ్ : గ్యాస్ లీక్ అయితే లీక్ సరి చేసి కొత్త గ్యాస్ నింపుతారు
కాయిల్ రిపేర్: చిన్న డ్యామేజ్ ఉంటే వెల్డింగ్ లేదా సీలింగ్ చేస్తారు
కాయిల్ రీప్లేస్‌మెంట్: కాయిల్ పూర్తిగా పాడైతే మార్చాల్సి ఉంటుంది
Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?
ఫిల్టర్లను ప్రతి నెల శుభ్రం చేయండి
చాలా తక్కువ టెంపరేచర్‌లో నిరంతరం AC వాడకండి
వోల్టేజ్ మార్పుల నుంచి రక్షణ కోసం స్టెబిలైజర్ వాడండి

