ఓటర్లలో అవగాహన పెంచేందుకు కేరళలో వినూత్న ప్రయత్నం జరిగింది. కేరళం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రతన్ యు కెల్కర్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొచ్చిలో ఈ వీడియోను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్క్షానేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ వీడియోలో, తిరువనంతపురం జిల్లా కలెక్టర్ అను కుమారి తో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.
సముద్ర తీరంలో చిత్రీకరించిన ఈ వీడియోలో, అధికారులు కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. “ఇది మీ ఓటు.. మన రాష్ట్రానికి మీ ఓటు అవసరం ఉంది. ఒకే లక్ష్యం ఆటను మార్చగలదు. ఒక ఓటు తలరాతను మార్చగలదు” అనే సందేశంతో సాగుతున్న పాటకు వారు స్టెప్పులు వేశారు.
ఈ వీడియో ద్వారా యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో ఓటు హక్కు పై చైతన్యం కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఇలాంటి క్రియేటివ్ ప్రచారాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ, వినూత్న ప్రయత్నంగా ప్రశంసలు అందుకుంటోంది. కొన్ని వర్గాలు అధికారుల ఈ కొత్త విధానాన్ని అభినందిస్తుండగా, మరికొంత మంది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, ఓటు విలువను ప్రజలకు చేరవేసే క్రమంలో కేరళ అధికారులు చేసిన ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
View this post on Instagram
Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?

