సన్ రైజర్స్ హైదరాబాద్ తో డేవిడ్ వార్నర్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 2014 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ తరుపున ఆడిన వార్నర్.. జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అంధించి తెలుగు అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నాడు. 2016లో సన్ రైజర్స్ హైదరబాద్ ఐపీఎల్ కప్పు గెలవడంలో వార్నర్ కృషి ఎంతో ఉంది. దాంతో తెలుగు అభిమానులు.. ధోని, రోహిత్, కోహ్లీ, వంటి స్వదేశీ ప్లేయర్స్ ను ఏ స్థాయిలో ఆధారిస్తారో అదే విధంగా వార్నర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ఆరాధిస్తారు. వార్నర్ కూడా తెలుగు అభిమానులపై వార్నర్ కూడా ఎప్పటికప్పుడు ఎనలేని ప్రేమ కనబరుస్తూ ఉంటాడు. .
సోషల్ మీడియా తెలుగు టాప్ హీరోల మూవీ డైలాగ్స్, డబ్ స్మాష్ లు చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు వార్నర్. అయితే 2022 లో ఎవరు ఊహించని విధంగా వార్నర్ ను సన్ రైజర్స్ పక్కన పెట్టేసింది. అయితే వార్నర్ ను ఉద్దేశ్యపూర్వకంగానే సన్ రైజర్స్ యజమాన్యం తప్పించిందని ఎన్నో వార్తలు వచ్చాయి. సన్ రైజర్స్ పక్కన పెట్టేయడంతో ఎంతో ఆవేధన వ్యక్తం చేశాడు. అయితే యజమాన్యం వార్నర్ ను వదిలేసినప్పటికి అభిమానులు మాత్రం వార్నర్ ను వదలడం లేదు. ప్రస్తుతం డిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వున్న వార్నర్.. డిల్లీ హైదరబాద్ మ్యాచ్ కోసం హైదరబాద్ లోని ఉప్పల్ స్టేడియం కు వచ్చాడు.
Also Read:సుమ గొంతు పట్టుకున్న హీరో..అసలు ఏమైంది..!
తెలుగు అభిమానులంతా వార్నర్ భాయ్ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక ఈ మ్యాచ్ లో హైదరబాద్ పై డిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ క్యాపిటల్స్ 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హైదరబాద్ ముందు ఉంది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక సన్ రైజర్స్ చేతులెత్తేసింది. నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో వార్నర్ శాపం ఎస్‌ఆర్‌హెచ్ కు తగిలందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వచ్చే సీజన్ లో తిగిరి వార్నర్ ను ఎస్‌ఆర్‌హెచ్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నేటి మ్యాచ్ లో గుజరాత్ తో ముంబై తలపడనుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read:CMKCR:దేశం పురోగమిస్తుందా.. తిరోగమిస్తుందా..?