దేశంలో ప్రస్తుతం రెండుకు కూటములు మాత్రమే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఒకటి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కాగా.. మరోటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. మరి ఈ రెండు కూటములపై అసహనంగా ఉన్న దేశ ప్రజానీకానికి వేరే ప్రత్యామ్నాయం లేదా అనే ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎందుకంటే అటు బిజెపి ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు ఒకరికి ఒకరు కొమ్ము కాస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలు అవుతోంది. ఫలితంగా ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ప్రత్యామ్నాయ శక్తి అవుతారనే భావన అందరిలోనూ నెలకొంది..
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శికంగా ఉంది. దాంతో కేసిఆర్ పాలనను దేశ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే కేసిఆర్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి మరియు ఇండియా కూటమిలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడాలని ఎంతో మంది జాతీయ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అటు ఎన్డీయే కూటమిలోగాని, ఇటు ఇండియా కూటమిలో గాని లేని పార్టీలు చాలానే ఉన్నాయి.
అటువంటి పార్టీలన్నీ ఏకమై ఆ పార్టీలకు కేసిఆర్ నాయకత్వం వహిస్తే దేశంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి రావడం గ్యారెంటీ అంటూ ఏంఐఏం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయన చేసిన వ్యాఖ్యలలో కూడా ఎంతో కొంత నిజం లేకపోలేదు.దేశ పాలన బీజేపీ కాంగ్రెస్ పార్టీల చుట్టూ మాత్రమే ఎందుకు తిరగాలి? ఆ రెండు పార్టీలు చేస్తున్న అవినీతి అక్రమాలకు చెక్ పెట్టలంటే థర్డ్ ఫ్రంట్ అవసరత చాలానే ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి ఎన్నికల సమయంలో థర్డ్ ఫ్రంట్ కు వేగంగా అడుగులు పడే అవకాశం లేకపోలేదు మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:తమలపాకుతో ఇలా చేస్తే.. జుట్టు స్ట్రాంగ్!