ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత?

52
- Advertisement -

గత కొన్ని రోజులుగా ఆసక్తి రేపిన తెలంగాణ ఎన్నికలు నిన్నటితో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక ఈసారి తెలంగాణ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టబోతున్నారు అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిపోర్ట్ అందరిని ఆశ్చర్య పరిచయనే చెప్పాలి. ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మద్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చాలా సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలనే ప్రామాణికంగా తీసుకోవచ్చా ? అసలు ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత ? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ను ప్రామాణికంగా తీసుకొని ఫలితాలను అంచనా వేయడం అవివేకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పోలింగ్ రోజు ఓటరు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రతి వెయ్యి మందిలో 200 మంచి అభిప్రాయాలను సేకరించి సర్వేల రిపోర్ట్ ఇస్తూ ఉంటాయి సంస్థలు. వీటి ద్వారా ఫలితాలను తేల్చి చెప్పలేము అనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ 2018 ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ ( బి‌ఆర్‌ఎస్ ) కు స్వల్ప మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా టి‌ఆర్‌ఎస్ అత్యధికంగా 88 సీట్లను సొంతం చేసుకుంది. దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ ఊహాజనితమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నిన్న బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తో ఫలితాలు స్పష్టం కాలేదని.. డిసెంబర్ 3 నే అసలు ఫలితాలు వెలువడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Also Read:LPG Price:గ్యాస్ ధరల పెంపు

- Advertisement -