ఎన్డీయేతో దోస్తీ.. ఆ పార్టీలు కలుస్తాయా?

40
- Advertisement -

బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీయే కూటమితో కలిసే పార్టీలు ఏవి? గెలుపు కోసం బీజేపీ ఎలాంటి ప్లాన్స్ చేయబోతుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. అసలే ఈసారి 350కి పైగా సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అంతా భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్డీయేతో కలిసే పార్టీల పాత్ర కీలకం అయ్యే అవకాశం ఉంది. అందుకే తమతో కలిసి నడిచే పార్టీలపై దృష్టి సారించింది బీజేపీ. అందులో భాగంగానే ఈ నెల 18 ఎన్డీయే మిత్రా పక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుంది. .

ఈ సమావేశంలో పాల్గొనే పార్టీలతోనే ఎన్డీయేతో కలిసి నడిచే పార్టీలు ఏవనే దానిపై స్పష్టత రానుంది. అయితే గతంలో ఎన్డీయేలో ఉన్న టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు కూటమి నుంచి బయటకు వచ్చాయి. అలాగే ఎన్సీపీ, శివసేన పార్టీలోని అంతర్గత సంక్షోభం కారణంగా ఎన్డీయేతో పొత్తుకు సిద్దమౌతయా లేదా అనేది కూడా సందేహమే. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ, టీడీపీ, బి‌ఆర్‌ఎస్ వంటి పార్టీలు ఎన్డీయేతో కలిసేందుకు సిద్దంగా ఉన్నాయా లేవా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఎన్డీయేతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉంది. కానీ ఈ నెల 18న జరిగే సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం ఆడుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.

Also Read:పచ్చదనం పెంపు..ప్లాస్టిక్ నియంత్రణకు పాటుపడతాం

వైసీపీ విషయానికొస్తే బీజేపీకి దూరం పాటిస్తూనే దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ విషయానికొస్తే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఎన్డీయేతో కలిసే ప్రసక్తే లేదు. ఇక తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీతో ప్రస్తుతం బీజేపీ పొత్తులో ఉన్నప్పటికి.. ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా మారతాయనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఎన్డీయేలో చేరే పార్టీల విషయంలో సౌత్ కంటే నార్త్ పైనే బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 18నా జరిగే సమావేశం కొరకు ఇప్పటికే లోక్ జన్ శక్తి పార్టీ, అప్నా దళ్, శివసేన షిండే వర్గం వంటి పార్టీలకు ఆహ్వానం పంపగా.. ఇంకా ఏ ఏ పార్టీలకు ఆహ్వానం పంపాలనే దానిపై బీజేపీ కసరత్తులు చేస్తోందట. మొత్తానికి ఎన్డీయేతో కలిసే పార్టీలు ఏవో అనే దానిపై ఈ నెల 18న జరిగే సమావేశంతో క్లారిటీ రానుంది.

Also Read:రైతులను చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే..

- Advertisement -