‘బేబీ’ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

38
- Advertisement -

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. రెండో రోజు కూడా దాదాపు 6 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్ అశ్విన్ కీలకపాత్ర పోషించారు.

అయితే, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫాం ‘ఆహా’ సొంతం చేసుకోగా.. 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్.. ఈ ముగ్గురు పోటీ పడి మరీ నటించారు. లవ్ అండ్ యూత్‌ ఫుల్ ఎంటర్‌ టైనర్ గా ఈ మూవీ యూత్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. అన్నీ థియేటర్లలో ఆల్ మోస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి.. ఈ సినిమా హిట్ కింద లెక్కే.

Also Read:‘నా.. నీ ప్రేమ కథ’..ట్రైలర్

ఇక ఈ సినిమాకు అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ నుంచి కూడా సపోర్ట్ అందింది. హైదరాబాద్‌ లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ లో సినిమా చూసిన రష్మిక కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ బేబీ సినిమా చాలా బాగుందని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆనంద్‌, వైష్ణవితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఈ సినిమా పిల్లలు చేశారు. చాలా బాగుంది’ అని ట్వీట్‌ చేశారు. మొత్తానికి జూనియర్ దేవరకొండకి రష్మిక – విజయ్ గట్టిగానే సపోర్ట్ ఇస్తున్నారు.

Also Read:రైతులను చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే..

- Advertisement -