Tamarind:చింతపండు అతిగా వాడితే ప్రమాదమా?

64
- Advertisement -

చింతపండు గురించి మనందరికి తెలిసే ఉంటుంది. వంటల్లో అత్యంత విరివిగా ఎక్కువమంది ఉపయోగించే పదార్థాలలో చింతపండు కచ్చితంగా ఉంటుంది. పుల్లటి రుచిని కలిగి ఉండే దీనిని ప్రతి కూరలోనూ వాడతారు. ఇంకా చింతపండుతో సాస్, పచ్చడి, వంటివి కూడా చేసుకొని అరగిస్తారు. కూరల రుచిని పెంచడంలో చింతపండు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అయితే చింతపండు వాడడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే దానిపై మాత్రం చాలమందికి అవగాహన ఉండదు. కాబట్టి చింతపండు వాడకం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఒకసారి తెలుసుకుందాం !

చింతపండులో ఉండే పులుపు కారణంగా ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇంకా విటమిన్ ఏ, ఇ, కె, మరియు బి1, బి2, బి3, బి6 వంటివి కూడా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు. ఇంకా ఇందులో సాచూరేటెడ్, మోనో అంశారేటెడ్, పోలి అంశారేటెడ్ వంటి ఫ్యాటి యాసిడ్లు కూడా ఉంటాయి. చింతపండు తినడంవల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇంకా మలబద్దకం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇంకా మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి చింతపండు ఎంతో ప్రయోజనాకారి అని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా అధిక రక్తపోటును తగ్గించి రక్త ప్రసరణను క్రమబద్దీకరిస్తుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలకు కూడా చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చింతపండును ఎక్కువగా తినే దుష్ప్రభావాలు కూడా చాలానే ఉన్నాయి. చింతపండును ఎక్కువగా తింటే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందట. ఇంకా అల్సర్, అసిడిటీ వంటి సమస్యలు కూడా ఉత్మన్నమౌతాయి. ఇంకా చింతపండు అధికంగా తినే వారికి తల వెంట్రుకలు నెరసిపోతాయి. వృద్దప్య ఛాయలు కనిపిస్తాయి. బుద్ది కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చింతపండు వాడకం మితంగా ఉండేలా చూసుకోవాలి.

Also Read:ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం!

- Advertisement -