Smart Watch:స్మార్ట్ వాచ్ వాడితే..మంచిదేనా?

47
- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ చేతికి స్టైల్ గా స్మార్ట్ వాచ్ ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు, ఈ స్మార్ట్ వాచ్ ద్వారా డైలీ యాక్టివిటీస్ ను తెలుసుకునే వీలు ఉంటుంది.వీటి ద్వారా ఆరోగ్య ఆరోగ్య పరమైన సమాచారం కూడా తెలుసుకుంటూ ఉంటాము. రోజుకు నడిచిన దూరం, బీపీ మానిటర్, షుగర్ లెవెల్స్, హార్ట్ బీట్ .. ఇలా ఎన్నిటినో స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. అయితే ఇందులో చూపించే రిజల్ట్ కచ్చితమైనవి కాకపోయినప్పటికీ.. మన ఆరోగ్య పరమైన సమాచారంపై ఓ అంచనాకు వచ్చే వీలుంటుంది. ఇదిలా ఉంచితే స్మార్ట్ వాచ్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని నిత్యం చేతికి అలాగే ఉంచుకోవడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు స్మార్ట్ వాచ్ కేంద్రంగా మారుతుందట..

స్మార్ట్ వాచ్ లను అలాగే చేతికి పెట్టుకోవడం వల్ల ఆ ప్రదేశంలో దుమ్ము ధూళి పెరుకుపోయి సాల్మోనెల్లా, స్టెఫీలోకాకస్ వంటి బ్యాక్టీరియా వృద్ది చెందుతున్నట్లు పలు అధ్యయనలు చెబుతున్నాయి. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తాయట. తద్వారా రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి అరగంట లేదా గంటకోసారి చేతికి ఉన్న వాచ్ తీస్తూ గాలి తాకేలా చూసుకోవాలి. ఇకపోతే స్మార్ట్ వాచ్ లను ఉపయోగించి షుగర్ లెవెల్స్ , బ్లేడ్ ప్రేజర్, హార్ట్ బీట్.. వంటివి చెక్ చేసుకుంటూ ఉంటారు చాలమంది, అయితే ఇందులో చూపించే రిపోర్ట్ ఖచ్చితమైనదిగా భావిస్తే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇందులో చూపించే రిపోర్ట్ నామమాత్రంగానే ఉంటుందే తప్పా ఆరోగ్యంపై క్లియర్ సమాచారం ఇవ్వలేదు. కాబట్టి హెల్త్ కు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ చూసుకోవాలన్న స్మార్ట్ వాచ్ లపై ఆధార పడకుండా మెడికల్ లాబ్స్ సంప్రదించడం ఎంతో మేలు.

Also Read:KTR:లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటాం

- Advertisement -