కల్లు తాగిన సింగర్ సునీత..?

93
sun

రెండో పెళ్లి తర్వాత ఏదో ఒక న్యూస్‌తో వార్తల్లో నిలుస్తున్నారు సింగర్ సునీత. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సునీత అక్క‌డ త‌న కో యాంక‌ర్ గాయ‌త్రి భార్గ‌వితో క‌లిసి కల్లు గ్లాస్ పట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వీరితో పాటు గీత కార్మికుడు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారగా సునీత కల్లు తాగిందా లేదా కేవలం ఫోటోకు మాత్రమే ఫోజు ఇచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.

గ‌త ఏడాది నవంబ‌ర్‌లో బిజినెస్‌మెన్ రామ్‌తో నిశ్చితార్దం జ‌రుపుకున్న సునీత జ‌న‌వ‌రిలో అతనితో క‌లిసి ఏడ‌డుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత సునీత ఏదో ఒక టాపిక్‌తో త‌రచు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది.