Bigg Boss 7 Telugu:ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్

57
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 6వ వారం పూర్తి చేసుకోవడానికి వస్తోంది.ఇక ఈ వారం నామినేషన్‌లో ప్రిన్స్ యావర్,అమర్ దీప్,టేస్టీ తేజా,శోభా శెట్టి,నయని పావని,పూజా మూర్తి,అశ్విని శ్రీ ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారని ఓపినియన్ పోల్ నిర్వహించగా శోభా శెట్టి ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

శోభాశెట్టికి 43 శాతం ఓట్లు పడగా తర్వాత అమర్ దీప్ 32 శాతం ఓట్లతో ఉన్నాడు. వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉండగా తర్వాత అశ్విని శ్రీ 9 శాతం ఓట్లతో ఉంది. టేస్టీ తేజా 7 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంటే.. పూజా మూర్తి 4 శాతం ఓట్లతో ఐదో స్థానం,నయని పావని 3 శాతం ఓట్లతో ఆరో స్థానం,ప్రిన్స్ యావర్ 2 శాతం ఓట్లతో ఉన్నాడు.

వాస్తవానికి శోభా శెట్టి ఆరోవారం వరకు ఉండటమే ఎక్కువ. హౌస్‌లో ఆమె ప్రవర్తనకి అసలు రతిక కంటే ముందే ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఆమెకు బిగ్ బాస్ మూడు వారాల ఇమ్యునిటీ ఇవ్వగా మూడో పవర్ అస్త్ర గెలుచుకుని మూడు వారాలు నామినేషన్స్‌లోకి వెళ్లకుండా తప్పించుకుంది. ఇప్పుడు ఆ ఇమ్యునిటీ అయిపోవడంతో ఆరోవారంలో నామినేషన్స్‌లో నిలిచింది శోభాశెట్టి. సో ఓటింగ్ ప్రకారం చూస్తే శోభాశెట్టి ఎలిమినేట్ కావడం పక్కా..మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో వేచిచూడాలి..

Also Read:చంద్రబాబు కు బెయిల్.. రెడీ?

- Advertisement -