రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటమి తప్పదా?

55
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీలలోని కీలక నేతల విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి ఓటమి చవి చూసిన నేతలు ఈసారైనా గెలుపు తలుపులు తెరుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో ఈ చర్చ ఇంకాస్త ఎక్కువైంది. ఎందుకంటే ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నారు దానికి తోడు హస్తంపార్టీ తరుపున సి‌ఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరే ప్రధానంగా వినిపిస్తోంది..

దీంతో గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆయన ఈసారి గెలిచి నిలిచేనా అనే డౌట్లు వస్తున్నాయి. గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి ఘోర ఓటమి చవిచూశారు. 9319 ఓట్ల మెజారిటీతో పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పై గెలుపొందారు. ఇక ఈసారి కూడా రేవంత్ రెడ్డి కోడంగల్ నుంచి పోటీ చేయనున్నారు. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించిన పట్నం నరేందర్ రెడ్డినే ఈసారి కూడా బరిలో దించారు అధినేత కే‌సి‌ఆర్. దీంతో మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదా ? అనే భయం టీ కాంగ్రెస్ ను వెంటాడుతోందట.

Also Read:దేశంలో థర్డ్ ఫ్రంట్.. అధిపతిగా కే‌సి‌ఆర్?

ఎందుకంటే ప్రస్తుతం ప్రజల్లో కే‌సి‌ఆర్ సర్కార్ పై ఉన్న సానుకూలతతో పాటు స్థానిక ఎమ్మెల్యే అయిన పట్నం నరేందర్ రెడ్డి పై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఆయనకు గతంలో ఆ స్థాయి విజయం లభించిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటివరకు కోడంగల్ నియోజిక వర్గానికి సంబందించిన సర్వేల్లో కూడా పట్నం నరేందర్ రెడ్డికి అనుకూలత ఎక్కువగా వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి మళ్ళీ పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి రేవంత్ రెడ్డి ఓడిపోతే పార్టీ మారే అవకాశం ఉందని కూడా కొందరు అగ్రనేతలు విమర్శిస్తున్నారు. మరి కోడంగల్ రేవంత్ రెడ్డి ఫెట్ ఎలా ఉందో చూడాలి.

Also Read:‘ట్రెండ్ సెట్టర్’ కి హ్యాపీ బర్త్ డే

- Advertisement -