కాంగ్రెస్ కు రేవంత్ తోనే ముప్పు?

50
- Advertisement -

కర్నాటక ఎన్నికల విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా టి కాంగ్రెస్ లో ఈ జోష్ మరింత కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల ముందు డీలా పడ్డ హస్తం పార్టీకి ఆ ఎన్నికల్లో లభించిన విజయం పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చింది. అంతకు ముందు వర్గ పోరు ఆదిపత్య విభేదాలతో కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదిలే ప్రయత్నం చేస్తోంది. పార్టీలోని కీలక నేతలు కూడా విభేదాలను పక్కన పెట్టి ఒకే తాటిపై నడిచేందుకు ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సీనియర్ నేతలు ఇప్పుడు విజయమే లక్ష్యంగా సాగుతున్నారు.

ఇదిలా ఉంచితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో చేసే వ్యాఖ్యలు పార్టీని అప్పుడప్పుడు చిక్కుల్లోకి నేడుతుంటాయి. ఇటీవల రైతుల విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. రైతులకు ఉచిత కరెంట్ అవసరం లేదని, మూడు గంటల కరెంట్ మాత్రమే సరిపోతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి విధితమే. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో కొత్త చర్చకు తావిచ్చాయి. అసలు రైతుల విషయంలో కాంగ్రెస్ వైఖరి ఎంటనే ప్రశ్నను తెరపైకి తెచ్చాయి. ఒకవైపు రైతు సంక్షేమమే ధ్యేయంగా కే‌సి‌ఆర్ సర్కార్ ముందుకు కదులుతుంటే.. అసలు రైతులకు కరెంటే అవసరం లేదన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

దీంతో ఒక్కసారిగా హస్తం పార్టీ దూకుడుకు కళ్ళెం పడినట్లైంది. కర్నాటక ఎన్నికలు ఇచ్చిన జోష్ ను కంటిన్యూ చేద్దామనుకుంటే.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్టీపై నెగిటివ్ ఇంపాక్ట్ గట్టిగానే పడింది. దీనిపై కాంగ్రెస్ లోని ఇతర నేతలు కూడా సంజాయిసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. గతంలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు.. ఈ అంశాన్ని రేవంత్ కు వ్యతిరేకంగా ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. దీంతో తమొకటి అనుకుంటే దైవం ఇంకోటి తలుస్తాదన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్న హస్తం నేతలకు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీని గాడి తప్పెలా చేశాయి. మరి హస్తం పార్టీ రేవంత్ వ్యాఖ్యాలాపై ఎలాంటి ఎజెండా కలిగి ఉంటుందో చూడాలి.

Also Read:సినీ రంగంలోకి షర్మిల కొడుకు!

- Advertisement -