జగన్ పాలనలో ‘రాజారెడ్డి రాజ్యాంగం’!

34
- Advertisement -

తమ్ముడు తనవాడైనా న్యాయం కరెక్ట్ గా చెప్పాలి అనే సామెత వైసీపీకి వర్తించదా అంటే అవుననే అంటున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీలో నిత్యం అనుచిత వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతలు చాలమందే ఉన్నారున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు పై ఆయన కుమారుడు నారా లోకేశ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు వంటి వారు మహిళలతో అనుచిత సంభాషణలు జరిపిన ఆడియో రికార్డులు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ ఏకంగా మహిళాతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడిన అంశం ఎంతటి సంచలనం అయిందో అందరికీ తెలిసిన విషయమే.

కానీ ఇంతటి అసంభ్యకర పరిణామాలు సొంత పార్టీ నేతల విషయంలో చోటు చేసుకుంటూ ఉంటే ఏ ఒక్కరి పైన చర్యలు తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ నేతల విషయంలో మాత్రం కాస్త భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ అనుచిత చేశారనే కారణంతో రోజు గడవక ముందే అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. సొంత పార్టీలో నేతలను అదుపులో ఉంచుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీ నేతలపై మాత్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనలో అమలౌతోంది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, రాజారెడ్డి రాజ్యాంగం అని టీడీపీ సీనియర్ నేతలైన పల్లా శ్రీనివాసరావు, బండారు అప్పలనాయుడు విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం టీడీపీ నేతల విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరంతా కక్షపూరితమే తప్పా ఇంకోటి లేదని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.

Also Read:‘సల్మాన్ – ప్రభాస్’ లతో ఎన్టీఆర్

- Advertisement -