‘సల్మాన్ – ప్రభాస్’ లతో ఎన్టీఆర్

18
- Advertisement -

ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. కానీ, మరోపక్క ఎన్టీఆర్ పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్న చిత్రం ‘వార్‌2’ లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా కంటే ముందే సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’లో క్లైమాక్స్‌ సన్నివేశంలో ఎన్టీఆర్‌ కనిపించనున్నారట. ఈ చిత్రానికి మనీశ్‌ శర్మ దర్శకుడు. మరి ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

అలాగే, ప్ర‌శాంత్ నీల్, ప్ర‌భాస్ కాంబోలో వ‌స్తున్న స‌లార్ సినిమా డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానుంది. తాజాగా స‌లార్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ త‌ర్వాత వ‌చ్చే పోస్ట్ క్రెడిట్స్‌లో య‌ష్‌, తార‌క్‌ల స‌ర్‌ప్రైజ్ క్యామియోలుంటాయ‌ని, వాటిని ఊహ‌కంద‌ని విధంగా నీల్ డిజైన్ చేశాడ‌ని స‌మాచారం. ఇది నిజ‌మైతే సినీ ల‌వ‌ర్స్‌కు పండ‌గ‌నే చెప్పాలి. మొత్తానికి రెండు భారీ సినిమాల్లో ఎన్టీఆర్ అతిధి పాత్రల్లో నటిస్తే.. కచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది పండుగే.

ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. వచ్చే వారం మొదలు కాబోయే యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అలాగే సైఫ్ అలీఖాన్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని కొరటాల శివ చిత్రీకరిస్తారట. సైఫ్ అలీఖాన్ దేవరలో స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నాడు. టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ల సారథ్యంలో కొరటాల శివ తన మార్క్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీన్ ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read:Modi:ఆ హామీల సంగతేంటి?

- Advertisement -