Wednesday, January 22, 2025
Home టాప్ స్టోరీస్ మంత్రి పదవి దక్కేనా.. రాజన్న?

మంత్రి పదవి దక్కేనా.. రాజన్న?

67
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 11 మందికి మంత్రి పదవులు కేటాయించిన కాంగ్రెస్.. మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి ఎన్నుకునేందుకు సిద్ధమౌతోంది. ఇక ఈ సెకండ్ లిస్ట్ మంత్రి పదవి కోసం షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, గడ్డం వినోద్, మల్లారెడ్డి రంగారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, మధన్ మోహన్ రావు, మధుయాష్కీ, అద్దంకి దయాకర్ వంటి వారు పోటీ పడుతున్నారు. ఇక ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం గట్టిగానే పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతం రెండో లిస్ట్ కోసం రేస్ లో చాలా మంది ఉండడంతో మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి ని వరిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి..

ఎందుకంటే మొదట కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగినప్పటికీ ఆ తర్వాత బీజేపీలో చేరడంతో రాజగోపాల్ రెడ్డి అవకాశవాది అనే ముద్ర బలపడింది. దానికి తోడు సరిగ్గా ఎన్నికల ముందు మళ్ళీ బీజేపీ నుంచి జంప్ అయి సొంత గూటికి చేరారు. దీంతో పార్టీలో ఆయన ప్రదాన్య తగ్గిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ మునుగోడు తరుపున విజయం సాధించారు. ఇప్పుడు మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. తనకు మాత్రం పదవి కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇతరుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో హస్తం హైకమాండ్ మరియు రాష్ట్ర అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

- Advertisement -