ఏపీకి జీవనాడీగా పిలుచుకునే పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదా ? పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసిందా ? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు చర్చల్లో నిలిచిన ఇదిగో ఇప్పుడు పూర్తి చేస్తాం ? లేదా అప్పుడు పూర్తి చేస్తాం ? అని గాల్లో మాటలు చెప్పడం తప్పా ఇంతవరుకు ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది లేదు. ఏళ్ళు గడుస్తున్న ప్రబుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ మాత్రం ఇంకా తొలిదశలోనే ఉంది. ప్రాజెక్ట్ కు జాతీయ హోదా దక్కినప్పటికి ఇంకా నిర్మాణదశలోనే ఉండడం నిజంగా ఆశ్చర్యమే.
చంద్రబాబు హయంలో కొంతమేర పోలవరనికి సంబంచిన పనులు వేగంగా జరిగాయి. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ప్రాజెక్ట్ పనులు ఎలా జరుగుతున్నాయనేది కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. 2021 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్.. ఆయన పదవి నుంచి దిగిన తరువాత ఎందుకు పూర్తి చేయలేదనే ప్రశ్నకు నో కామెంట్స్ అంటూ దాటవేస్తున్నారాయన. ఇక ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు.. అసలు ప్రాజెక్ట్ పూర్తి కావడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
Also Read:బండి సంజయ్ తెలంగాణకు దూరం అవుతారా?
ఇక తాజాగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇప్పట్లో పోలవరం పూర్తి కాదని చెప్పి ఒక్కసారిగా అందరిక్ షాక్ ఇచ్చారు. మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లే తెలుస్తోంది. మరో పది నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఈ పదినెలల్లో పోలవరం పూర్తి కావడం కష్టమే అని భావించిన జగన్ సర్కార్.. ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమని తేల్చి చెబుతోంది. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఇలా చెప్పడంతో ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ కథ కంచికే అని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read:వామ్మో వేపాకుతో ఎన్ని లాభాలో..!