పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
జూన్ 12న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ కు పవన్ కళ్యాణ్ వస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఎందుకంటే ఓ వైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలు ఇలా బిజీగా ఉండటంతో పవన్ .. వీరమల్లు ప్రమోషన్‌కి వస్తాడా లేదా అన్న సస్పెన్స్ మాత్రం నెలకొంది. అయితే పవన్ వస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని అంతా భావిస్తున్నారు.
Also Read:1300 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కిషన్ రెడ్డి

