21 రోజుల్లోనే రేషన్‌ సమస్యలకు పరిష్కారం!

6
- Advertisement -

ఏపీలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలను 21 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు మంత్ఇర నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడిన మనోహర్… 4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని తెలిపారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారన్నారు.

కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని…క్షేత్రస్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. సామాన్య ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా స్మార్ట్‌ రైస్‌ కార్డ్‌ను ప్రవేశపెడుతున్నామని, అందులో క్యూఆర్‌ కోడ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామన్నారు. దేశంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు.

గత పదిహేను రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమని చెప్పుకొచ్చారు. సర్వర్ డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక పోవడం వంటి వాటితో ఇబ్బంది కలిగిందన్నారు. ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్పరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించామని తెలిపారు.

Also Read:కేసీఆర్ కట్టిన సచివాలయం అద్భుతం:జగన్

- Advertisement -