బొప్పాయి గింజలతో..ఇంత ప్రమాదమా!

38
- Advertisement -

సాధారణంగా బొప్పాయి పండును పోషకాల గనిగా పరిగణిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బొప్పాయి పండులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే బొప్పాయి పండు తిన్న తర్వాత అందులోని గింజలను పారవేస్తుంటాము. అయితే బొప్పాయి గింజల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయని వివిధ మాద్యమాల్లో ఆర్టికల్స్ చదువుతుంటాము. నిజానికి బొప్పాయి గింజల వల్ల లాభాల కంటే నష్టాలే అధికం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బొప్పాయి గింజలు చూడడానికి మిరియాల ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ గింజలను ఎండబెట్టి ఆ తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకొని పాలలో లేదా ఫ్రూట్ సలాడ్ లో కలుపుని తాగితే ఎంతో మంచిదని కొందరు చెబుతుంటారు. .

నిజానికి బొప్పాయి గింజలు తినడం వల్ల చాలానే నష్టాలు ఉన్నాయి. బొప్పాయి గింజలను ఏ రకంగా తీసుకున్న అందులోని ఎంజైమ్ లు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను దెబ్బ తీస్తాయట. ఇంకా బొప్పాయి విత్తనాలలో ఉండే హానికరమైన సమ్మేళనాలు కాలేయ పనితీరును దెబ్బ తీస్తాయని పలు అద్యయానల్లో వెల్లడైంది. ఇంకా బొప్పాయి గింజల పొడిని తినడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందట. అంతే కాకుండా తీవ్రమైన తలనొప్పి, మైకం, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా సంభవించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బొప్పాయి పండు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. వాటి గింజలను తినడం వల్ల అంతకు మించి నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి బొప్పాయి తింటే మంచిదని వచ్చే వార్తలను నమ్మవద్దని కొందరు నిపుణులు నొక్కి చెబుతున్నారు.

Also Read:21న తెలంగాణ కేబినెట్‌ భేటీ

- Advertisement -