NDA:ఎన్డీఏ కు క్లీన్ స్లీప్ సాధ్యమేనా?

14
- Advertisement -

ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే దానిపై దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కేంద్రంలో అధికారం కోసం ఎప్పటిలాగే బీజేపీ కాంగ్రెస్ మధ్య ఈసారి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారం కోసం ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీకి చెక్ పెట్టె దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ఎన్డీఏం కూటమి తో పోలిస్తే ఇండియా కూటమి కొంత బలహీనంగానే కనిపిస్తోంది. పైగా ఇటీవల ఇండియా కూటమిలో చోటు చేసుకుంటున్నా పరిణామాలు కూటమిని మరింత బలహీన పరుస్తున్నాయి. దాంతో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న ఎన్డీయే కూటమి.. ఈసారి అంతకుమించి అనేలా ఏకంగా 400 సీట్లకు పైగా సాధించే దిశగా టార్గెట్ పెట్టుకుంది. అయితే అది సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతూ వచ్చాయి.

కానీ ప్రస్తుతం ప్రత్యర్థి ఇండియా కూటమి బలహీన పడుతూ ఉండటంతో ఎన్డీయే కూటమి 400 సీట్లను సాధించడం పెద్ద కష్టమేమి కాదని చెబుతున్నారు కొందరు విశ్లేషకులు. ఇదే అంశంపై ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తన అభిప్రాయాన్ని ఇటీవల వెల్లబుచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్పడంతో జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం సీట్ల కేటాయింపు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కమలం పార్టీ సరైన నేతలను ఎన్నికల బరిలో నిలిపితే లక్ష్యాన్ని చేరే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. మరి మూడోసారి అధికారం కోసం ఆరాటపడుతున్న కమలం పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందో లేదో చూడాలి.

Also Read:ఈ క్రిమినల్ కేసుకు కారణం కొరటాలే

- Advertisement -