మల్కాజ్ గిరి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వైఖరి ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేసి తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారాయన. మల్కాజ్ గిరి సీటుతో పాటు మేదక్ సీటు తన తనయుడికి ఆశించిన మైనంపల్లి సీటు ఇవ్వకపోతే బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలను కూడా ఇచ్చారు. అంతకు ముందు హరీష్ రావు ను ఉద్దేశించి ” మెదక్ లో హరీష్ రావు పెత్తనం చేస్తున్నారని, అంతు చూసే వరకు వదలబోనని, వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని ” ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి. .
బిఆర్‌ఎస్ పార్టీకి మూలస్తంభంలా ఉన్న హరీష్ రావు పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా మైనంపల్లికి తిరిగి మల్కాజ్ గిరి టికెట్ కేటాయించారు. ఆ తరువాత వెంటనే తాను బిఆర్‌ఎస్ లోనే కొనసాగుతానని కార్యకర్తలు సంబరాలు చేసుకోవాలని వ్యాఖ్యానించిన మైనంపల్లి.. తాజాగా మళ్ళీ పాతపాటే పాడారు. తనకు తన కూడుకు భవిష్యత్ ముఖ్యమని, మెదక్ టికెట్ తన కొడుకుకె ఇస్తే బిఆర్‌ఎస్ తరుపున ఇద్దరం పోటీ చేస్తామని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.
Also Read:కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
దీంతో మైనంపల్లి వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి పోటీ చేయకపోవడం తన ఇష్టమని ఇప్పటికే కేసిఆర్ స్పష్టం చేశారు. అటు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ కూడా మైనంపల్లి వైఖరి పై సీరియస్ గానే ఉన్నారు. దీంతో మల్కాజ్ గిరి నియోజిక వర్గంలో మైనంపైల్లికి టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటికీ ఆయన తన వ్యవహార శైలితో చేజెతుల టికెట్ క్యాన్సిల్ చేసుకునేలా చేసుకుంటున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మైనంపల్లి విషయంలో బిఆర్‌ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read:దొంగ ఓట్లే జగన్ బలమా?