దొంగ ఓట్లే జగన్ బలమా?

15
- Advertisement -

ఏపీ పస్తుతం దొంగ ఓట్ల అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతుడడంతో వేగం పెంచుతోన్న ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా పర్యవేక్షణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో వెలువడుతున్న దొంగ ఓట్ల జాబితాను చూసి ఎన్నికల అధికారులు విస్తుపోతున్నారట. ఊహించని విధంగా దొంగఓట్ల జాబితా వెలుగులోకి వస్తున్నట్లు ఏపీ పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దొంగ ఓట్ల కారణంగానే గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారని, ఈసారి దొంగఓట్లు జరగకపోతే జగన్ నాలుగు సీట్లు కూడా గెలిచే అవకాశం లేదని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి..

అటు టీడీపీ కూడా దొంగ ఓట్ల వ్యవహారంపై జగన్ సర్కార్ ను తీవ్రంగా విమర్శిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ దొంగఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు రిపోర్ట్ చేసేందుకు ఈ నెల 28న డిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. దొంగ ఓట్లకు సంబంధించి అన్నీ ఆధారాలు ఉన్నాయని చెబుతున్నా ఆయన సాక్షాధారాలతో ఈడీ కి రిపోర్ట్ చేయనున్నాడట. దీంతో జగన్ గత ఎన్నికల్లో గెలుపుపై కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

గత ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో 151 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. ఈ స్థాయి విజయం ఏపీ చరిత్రలోనే మొదటిది అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇంతటి ఘనవిజయానికి కారణం దొంగఒట్లేనా అనే అనుమానాలు తాజా పరిణామాలతో వ్యక్తమౌతున్నాయి. మరి ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తే వైఎస్ జగన్ ఇరకాటంలో పడే అవకాశం ఉందా ? లేదా చంద్రబాబు చేస్తున్నది వైసీపీపై బురద చల్లే ప్రక్రియనేనా అనేది ముందు రోజుల్లో తెలనుంది. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఈ దొంగఓట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

Also Read:మెగాస్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -