నందమూరి వారి వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు రోజుకో వార్తని రాస్తున్నాయి వెబ్ సైట్ లు. ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ సినిమా ముహుర్తాలు అంటూ, మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్ షూటింగ్ అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, బాలయ్య సన్నిహితుల వద్ద నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ పొలిటికల్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. ఈ సినిమా కథలో బాలయ్య యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రానుంది.
ఈ ఎపిసోడ్ లో యంగ్ బాలయ్య పాత్రలో మోక్షజ్ఞ నటించబోతున్నాడని తెలుస్తోంది. బాలయ్య సన్నిహితులు కూడా ఈ సారి ఈ వార్తను కన్ఫర్మ్ చేశారు. మరి ఇదే నిజమైతే మోక్షజ్ఞకి ఇంతకంటే పవర్ ఫుల్ ఎంట్రీ మరొకటి ఉండదని బాలయ్య అభిమానులు అంటున్నారు. పైగా తండ్రి పాత్రలో కొడుకు నటిస్తూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం బహుశా మోక్షజ్ఞకి దక్కిన గొప్ప అవకాశం కూడా. ఇప్పటికే అఖండ 2 స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీగా ఉందని బాలయ్య రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు.
Also Read: ద్వారాకా క్రియేషన్స్‌తో శ్రీకాంత్ అడ్డాల
బహుశా అందుకేనేమో మోక్షజ్ఞ కూడా స్లిమ్ గా మారడానికి కఠినమైన కసరత్తులు చేస్తున్నాడు. కేవలం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే మోక్షజ్ఞ తన ఫిట్ నెస్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరోపక్క బాలయ్య అఖండ 2 సినిమాని వేగంగా పూర్తి చెయ్యాలని పట్టుదలగా ఉన్నాడు. మరి ఆ వేగాన్ని మోక్షజ్ఞ అందుకోగలడా!?
Also Read: ఆయనెప్పుడూ సూపర్ హీరోనే