ప్లాన్ ఫెయిల్..మోడీకి సానుభూతి గ్యారంటీ?

18
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వాడి వేడి విమర్శలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల ప్రధాని మోడీని ఉద్దేశించి ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని మోడీకి కుటుంబం లేదని, అందుకే ఆయన వారసత్వ, కుటుంబ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కమలనాథులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మోడీకి మద్దతుగా తామంతా మోడీ కుటుంబమే అనే అర్థం వచ్చేలా  ” మోడీ కా పరివార్ ” అనే పదాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ కాంట్రవర్సీపై మోడీ కూడా స్పందించారు.. తనకు దేశంలోని 140 కోట్ల మంది కుటుంబ సభ్యులే అని వ్యాఖ్యానించారు.

ఇలా ఎన్డీయే మరియు ఇండియా కూటమి మధ్య ఆసక్తికరమైన కాంట్రవర్సీ జరుగుతోంది. అయితే లాలూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు మోడీకి అనుకూలంగా మరి సానుభూతి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోడీని ఒక అనాదగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే విపక్షలే నష్టపోతాయని, ఆ ప్రభావం ఎన్డీయేకు లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

అందుకే కమలనాథులు ఎన్నికల ముందు ” మోడీ కా పరివార్ ” అనే పదాన్ని బాగా హైలెట్ నానా హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాలకు అమిత్ షా, నడ్డా వంటి వారు ఆ పదాన్ని చేర్చుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ” మోడీ కా పరివార్ ” అనే నినాదంతో కమలనాథులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. గత 2014, 2019 ఎన్నికల సమయంలో కూడా విపక్షాలు చేసే విమర్శలను మోడీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు వస్తున్న విమర్శలు ఎటు తిరిగి మోడీకే ప్లెస్ అవుతున్నాయి. మొత్తానికి మోడీని ఇరకాటంలో పెట్టాలన్న ప్రతిపక్షాల ప్లాన్ లు బెడిసి కొట్టినట్లేనని చెప్పవచ్చు.

- Advertisement -