మోడీ.. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారా?

47
- Advertisement -

బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్న లక్ష్యం మాత్రం అధికారం వైపే ఉంటుంది. సక్రమంగానో లేదా అక్రమంగానో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగానే కమలనాథుల వ్యూహాలు నడుస్తుంటాయి. అయితే అన్నీ సందర్భాల్లో అదే వ్యూహాలు ఫలిస్తాయా అంటే ఫలించవనే చెప్పాలి. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ మద్య కమలనాథులు వేస్తున్న ప్రతి వ్యూహం బెడిసి కొడుతూనే ఉంది. కర్నాటక ఎన్నికల్లో విజయం కోసం వేసిన వ్యూహాలు ఫలించక పోగా కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టాయి. ఇక మణిపుర్ అల్లర్ల విషయంలో తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రత్యర్థులతో పాటు సామాన్యులు కూడా మోడీ సర్కార్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. .

ఇదిలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో మోడీని ఢీ కొట్టేందుకు అందరి చూపు రాహుల్ గాంధీ పై ఉన్న నేపథ్యంలో రాహుల్ పై ఏకంగా అనర్హత వేటు పడేలా చేసి తానకు ఎవరు పోటీలో నిలవకూడదనే రీతిలో ప్రవర్తించారు ప్రధాని మోడీ. కానీ ఊహించని రీతిలో రాహుల్ గాంధీ పై ఉన్న అనర్హత వేటు ఎత్తివేయబడింది. ఈ విధంగా బీజేపీ వేస్తున్న ప్రతి వ్యూహం కూడా ఈ మద్య బెడిసి కొడుతూనే ఉంది. దీంతో మోడీ ఇమేజ్ కూడా గట్టిగానే దెబ్బతింటోంది. గతంలో మోడీ పై ఉన్న ప్రజాధరణ ఈ మద్య చాలా వరకు తగ్గిందనే వాదన వినిపిస్తోంది. ప్రతిదీ కూడా తమ స్వార్థం కోసమే రాజకీయాలు చేయడం మోడీకి పెద్ద మైనస్ గా మారిందనేది కొందరు విశ్లేషకులు చెప్పే మాట.

Also Read:బ్యాంక్ సేవలన్నీ ఇకపై వాట్సాప్ లోనే..?

ప్రస్తుతం సర్వేలన్నీ మోడీకి అధికారాన్ని కట్టబెడుతున్నప్పటికి.. ప్రాక్టికల్ గా పరిస్థితి అలా లేదనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ప్రజలు మార్పు వైపు అడుగులు వేస్తున్నారని, మోడీ నియంత పాలనపై దేశప్రజలు పెదవి విరుస్తున్నారనే టాక్ బలపడుతోంది. దీంతో ఈసారి మోడీ అధికారంలోకి రావడం అంతా తేలికైనా విషయం కాదనేది స్పష్టమౌతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మోడీ చేజేతులా తన ఇమేజ్ ను తానే దెబ్బ తీసుకుంటున్నాడని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. మరి దేశ ప్రజల తీర్పు వచ్చే ఎన్నికల్లో మోడీకి షాక్ ఇవ్వనుందా లేదా అనేది చూడాలి.

Also Read:పవన్‌కి సపోర్ట్‌గా చిరంజీవి ప్రచారం

- Advertisement -