జగన్ ను దూరం పెట్టిన మోడీ!

45
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల హటాత్తుగా డిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో హటాత్తుగా జగన్ డిల్లీ వెళ్ళడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ లో కేంద్ర పెద్దల హస్తం కూడా ఉందని తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి, ఈ నేపథ్యంలో జగన్ డిల్లీ వెళ్ళడం ప్రదాన్యం సంతరించుకుంది. కాగా డిల్లీ టూర్ లో ప్రధాని మోడీ ని మరియు అమిత్ షా ను కలవాల్సి వుంది. నిన్న అమిత్ షా తో గంటల తరబడి బేటీలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు అమిత్ షా తో ఏం చర్చించారు. ఇందులో ఏమైనా రాజకీయ కోణం దాగి ఉందా ఉనే చర్చలు రాజకీయ వర్గాల్లో గట్టిగానే నడిచాయి.

అయితే రాష్ట్రనికి రావలసిన నిధుల గురించి చర్చించేందుకే జగన్ భేటీ అయ్యారని ప్రభుత్వ తరుపువారు చెబుతున్నా మాట. అయితే అమిత్ షా తో భేటీ అయిన జగన్.. ప్రధానితో సమావేశం కాకుండానే తిరిగి రాష్ట్రనికి చేరుకున్నారు. జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ లభించకపోవడంతోనే ఆయన నిరాశగా వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ మోడీ ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అంటే కొందరు విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అంశం హాట్ హాట్ గా సాగుతోంది. అసలే ముందు రోజుల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం ద్వారా బాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందనే బావన బలపడుతుందని, అందువల్ల టీడీపీ జనసేన కూటమిలో కలిసేందుకు బీజేపీకి దారులు మూసుకుపోతాయని ఆలోచించి వ్యూహాత్మకంగా మోడీ జగన్ ను దూరం పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read:TTD: అంత‌రిక్ష విజ్ఞానంపై అవ‌గాహ‌న పెంచుకోవాలి

- Advertisement -