బండికి భయం పోవట్లే..?

47
- Advertisement -

తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై ఇంకా సంధిగ్డంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బరిలో దిగలా లేదా సేఫ్ గా పార్లమెంట్ బరిలో దిగలా అనేది తేల్చుకోలేకపోతున్నారట. అధ్యక్ష పదవి చేజారిపోయిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా సైలెంట్ అయిన బండి.. ఎన్నికల విషయంలో అంతర్మతనానికి లోనౌతున్నాట్లు తెలుస్తోంది. బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాలని మొదటి నుంచి భావిస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారాయన. దాంతో ఈసారి కూడా ఆ భయం ఆయనను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. .

అసలే రాష్టంలో తన గెలుపుపై కల్లబొల్లి మాటలు ఎన్నో చెప్పారు బండి సంజయ్.. ఈ నేపథ్యంలో ఫలితం ఏ మాత్రం తేడా కొట్టిన తన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళనలో ఉన్నారట. అయితే బీజేపీకి అభ్యర్థుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని బీజేపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది బండి సంజయ్ పరిస్థితి.

గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు బండి సంజయ్.. ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ తరుపున కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ రెడ్డినే బరిలో బరిలోకి దిగుతున్నారు. దీంతో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేస్తే ఈసారి కూడా ఓటమి తప్పదనే భయం బండి సంజయ్ లో గట్టిగా కనిపిస్తున్నాట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వస్తే నిరభ్యంతరంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని బండి సంజయ్ ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బీజేపీ మాజీ అధ్యక్షుడిని ఓటమి భయం బాగానే వెంటాడుతోందని చెప్పవచ్చు.

Also Read:TTD: అంత‌రిక్ష విజ్ఞానంపై అవ‌గాహ‌న పెంచుకోవాలి

- Advertisement -