తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి?

85
- Advertisement -

మెగా కుటుంబంలోకి కోడలుగా అడుగు పెట్టిన ‘లావణ్య త్రిపాఠి’ కి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. అదే నిజమైతే పెద్ద సాహసమే అని చెప్పాలి. మరి ఆ మేటర్ ఏమిటో చూద్దాం. ‘లావణ్య త్రిపాఠి హోమ్లీ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుంది. హీరోయిన్ గా ఉన్న సమయంలో కూడా.. బోల్డ్ రోల్స్ చేయమంటే.. ఐ డోంట్ కేర్ అనేది. ఆ సమయంలో ‘లావణ్య త్రిపాఠి’ కొన్ని సినిమాలు కూడా వదులుకుంది. ఎలాంటి వివాదాల్లో కూడా ‘లావణ్య త్రిపాఠి’ ఇన్ వాల్వ్ కాలేదు. ఆఫ్ స్క్రీన్ మీద కూడా ‘లావణ్య త్రిపాఠి’ చాలా పద్దతిగా కనిపిస్తోంది.

కాగా ‘లావణ్య త్రిపాఠి’ తాజాగా తల్లి కాబోతున్నారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే, ఆమె నిజ జీవితంలో కాదు. ఓ సినిమాలో ఆమె స్టార్ హీరో తల్లిగా కనిపించనున్నారట. హీరో బాల్యంలో వచ్చే సన్నివేశాల్లో ‘లావణ్య త్రిపాఠి’ తల్లిగా చేస్తున్నారు. ఓ బడా ప్రాజెక్ట్ కి ఆమె సైన్ చేశారని అంటున్నారు. ‘లావణ్య త్రిపాఠి’ తల్లిగా కనిపించడం సాహసమే అని చెప్పాలి. కారణం ఆమెకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో లీడ్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ హీరోకి తల్లిగా నటిస్తే ‘లావణ్య త్రిపాఠి’ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

అదే సమయంలో ‘లావణ్య త్రిపాఠి’ ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ‘లావణ్య త్రిపాఠి’ తల్లి పాత్ర చేస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా ‘లావణ్య త్రిపాఠి’ పెళ్లి తర్వాత కూడా పూర్తిగా నటనపై దృష్టి పెట్టింది. పలు వైవిధ్యమైన పాత్రల్లో అలరించాలి అని ‘లావణ్య త్రిపాఠి’ ఫీల్ అవుతుంది. ప్రస్తుతం ‘లావణ్య త్రిపాఠి’ – వరుణ్ తేజ్ వెకేషన్ లో ఉన్నారని తెలుస్తోంది.

Also Read:KCR:ఆట ఆరంభం..కే‌సి‌ఆర్ ఎంట్రీ!

- Advertisement -