ఆ స్టార్ హీరోయిన్ గర్భవతి?

36
- Advertisement -

కియారా అద్వానీ గురించి బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. ‘కియారా అద్వానీ’ గర్భవతి అని మళ్ళీ పుకార్లు పుట్టించారు. ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్ తో మతి పోగొట్టిన ‘సిద్దార్థ్‌ మల్హోత్రా – కియారా అద్వానీ’లు గత ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహ బంధంతో ఒక్కటి అయిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన దగ్గర నుంచి.. కియారా అద్వానీ తల్లి కాబోతుంది అంటూ ఎప్పటికప్పుడు రూమర్స్ షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు వండి వార్చారు.

ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ ఇదే. కియారా అద్వానీ గర్భవతి అయ్యింది చెప్పడానికి ఓ చిన్న లాజిక్ కూడా చెబుతోంది బాలీవుడ్ మీడియా. రీసెంట్ గా కియారా అద్వానీ ఒక పోస్ట్ పెట్టిందట. అందులో ఆమె కాస్త లావుగా కనిపించిందని.. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో వీడియో పెట్టిందని.. అందులో కియారా అద్వానీ లూజ్ గా ఉండే సల్వార్ డ్రెస్ వేసుకుంది అని, పైగా కియారా అద్వానీ నడక కూడా చాలా నెమ్మదిగా ఉందని, ఈ రెండు వీడియోల ఆధారంగా కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అయిందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వండివార్చేస్తోంది.

అసలు ఇలాంటి విషయాలు దాచిపెడితే దాగేవి కావు. కాబట్టి కచ్చితంగా త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రావడం గ్యారెంటీ. పైగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే కియారా అద్వానీ ఇలాంటి విషయాల్ని షేర్ చేయడానికి అస్సలు మొహమాటపడదు. అయినా కియారా అద్వానీ తల్లి కాబోతుంది అంటూ గతంలోనే ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. ఐతే, అప్పుడు ఈ వార్తలు పూర్తిగా గాసిప్ రాయుళ్లు చేసిన బాగోతం అంటూ కియారా అద్వానీ సీరియస్ అయింది. మరి ఇప్పుడు కియారా అద్వానీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read:కుంకుమ పువ్వుతో ప్రయోజనాలు?

- Advertisement -